'ఫిట్‌నెస్ లేని ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోండి'

'ఫిట్‌నెస్ లేని ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోండి'

ATP: ఫిట్‌నెస్ లేని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని AIYF జిల్లా అధ్యక్షుడు కోటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాయదుర్గం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా RDO కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థి స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.