విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందజేత

SKLM: విద్యార్థినిలు చదువుతో పాటుగా పలు రకాల కోర్సులు నేర్చుకోవాలని లావేరు మండలం మురపాక KGBV పాఠశాల & కళాశాల ప్రిన్సిపల్ బి.సుధారాణి పేర్కొన్నారు. ఇటీవల KGBV లో బ్యూటీ, వెల్నెస్ కోర్సుల్లో విద్యార్థినిలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కోర్సులు నేర్చుకోవడంతో ఉపయోగాలు ఉన్నాయన్నారు.