VIDEO: ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన బైక్.. తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు

VIDEO: ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన బైక్.. తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు

కోనసీమ: పీ.గన్నవరం మండలం మొండెపు లంక ప్రధాన రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం నగరం నుంచి వస్తున్న బైక్, కారును తప్పించబోయి ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తండ్రికి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.