అక్కడ మొత్తం ఇల్లరికం అల్లుళ్లే..!

అక్కడ మొత్తం ఇల్లరికం అల్లుళ్లే..!

BDK: అల్లుడంటే పండక్కో పబ్బానికో వచ్చిపోతుంటాడు. కానీ కొత్తగూడెంలోని పేరాయిగూడెంలో మాత్రం అలా కాదు. ఊరు మొత్తంలో 150 కుటుంబాలు ఉంటే అందులో 100 ఇల్లరికం అల్లుళ్ల కుటుంబాలే. అలా అని వారు అత్తగారింట్లో ఉండరండోయ్.. ఈ ఊరిలో చేతినిండా పని దొరుకుతుందని వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇలా కొనసాగుతూనే ఉండడంతో ఏకంగా ఓ కాలనీనే ఏర్పడింది. దీనికి అల్లుళ్ల కాలనీ అని పేరు పెట్టడం విశేషం.