రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ADB: తాంసి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గిర్గమ గ్రామానికి చెందిన సిడం పార్వతి అనే మహిళను అదే గ్రామానికి పని నిమిత్తం వచ్చిన మహారాష్ట్రలోని ఉమ్మ్రి గ్రామానికి చెందిన రవిందర్ బైక్‌తో ఢీకుని పడి పోయారు. ఈ ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు 108లో రిమ్స్‌కు తరలించారు.