కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సప్
NRML: గుర్తు తెలియని వ్యక్తులు కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసినట్లు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా ప్రజలు ఆ వాట్సాప్ పేరుతో వచ్చిన సమాచారాన్ని నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.