ఆ దేశాలకు అమెరికా అండగా ఉంటుంది: ట్రంప్
ఇరాన్ దాడులతో నష్టపోయిన దేశాలకు అమెరికా అండగా ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్, సౌదీ, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలకు వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా దేశాల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ నుంచి ఆ దేశాలను కాపాడే బాధ్యతను అగ్రరాజ్యం మరిచిపోదని పేర్కొన్నారు.