తినుబండారాల కోసం వెళ్లిన చిన్నారిపై అత్యాచారం
WG: ఆచంట మండలంలో ఒక పంచాయతీ పరిధిలో ఆరేళ్ల బాలికపై కిరాణా షాపు యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. తినుబండారాల కోసం షాపునకు వెళ్లిన బాలికపై ఈ ఘోరానికి ఒడిగట్టాడు. ఐసీడీఎస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను చికిత్స కోసం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు