పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు
VKB: కుల్కచర్ల మండలం చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంగళవారం డాక్టర్ మనిష్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక వ్యాయామం, ధ్యానం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుప్పలి ఆనంద్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, దస్తయ్య తదితరులు పాల్గొన్నారు.