అంత్యక్రియలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్

అంత్యక్రియలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్

ADB: నెరడిగొండ మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన ఉప్పు పోశెట్టి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం నిర్వహించిన అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అంతకుముందు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.