ఘనంగా సహస్ర దీపాలంకరణ సేవ
NLR: బోగోలు(మం) కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి దేవస్థానం ఆలయ ఆవరణలో ప్రత్యేక దీపాలతో, సహస్ర దీపాలంకరణ సేవ వేద పండితుల నడుమ ఘనంగా జరిగింది.