తిమ్మాపురంలో చిరుత సంచారం కలకలం
అనంతపురం జిల్లాలోని తిమ్మాపురం గ్రామంలో చిరుత సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొలాల సమీపంలో కనిపించిన ఈ చిరుతపులి, తాజాగా రెండు ఆవు దూడలపై దాడి చేసి చంపింది. ఈ ఘటనతో గ్రామస్తులు, ముఖ్యంగా రైతులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి నేపథ్యంలో పంట పొలాలకు, వ్యవసాయ పనులకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. చిరుతను బంధించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.