'సమ్మిట్‌పై ఉన్న శ్రద్ధ బీసీ రిజర్వేషన్లపై లేదు'
HYD: గ్లోబల్ సమ్మిట్ మీద ఉన్న చిత్త శుద్ది బీసీ రిజర్వేషన్లపై లేదని బీసీ పొలిటికల్ ప్రంట్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చిక్కడపల్లిలో ఛైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించడానికే స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా, వైద్యంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.