రామయ్య విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి

రామయ్య విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి

గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొప్పురావులకాలనీలో రామయ్య నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేదమంత్రోచ్ఛారణల మధ్య హనుమత్ లక్ష్మణ సీతాసమేత రాముల వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పునర్నిర్మానికి రూ.5 లక్షల విరాళాన్ని మంత్రి అందజేశారు.