మెగా పేరెంట్స్ మీటింగ్‌కి హాజరైన ఎమ్మెల్యే
SKLM: ఇచ్చాపురం మండలం ధర్మపురం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌కి ప్రభుత్వ విప్ హోదాలో ఎమ్మెల్యే అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల తలరాతను మార్చేది కేవలం విద్య ఒక్కటే అని గుర్తు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.