మూడేళ్లుగా కరెంటు బిల్లు కట్టని తేజ్‌ ప్రతాప్‌

మూడేళ్లుగా కరెంటు బిల్లు కట్టని  తేజ్‌ ప్రతాప్‌

బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ మూడేళ్లుగా కరెంట్ బిల్లులు కట్టడం లేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రూ.3.6 లక్షల విలువైన విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పాట్నా బ్యూర్ ప్రాంతంలో ఉన్న సొంత ఇంటికి 2022 జూలై నుంచి ఇప్పటి వరకు ఆయన బిల్లులు చెల్లించలేదని అధికారులు గుర్తించారు. బిల్లులు క్లియర్ చేయాలని నోటీసులు పంపారు.