హైడ్రా మంత్రులకు కాపలా కాస్తోంది: జగదీష్
TG: బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన అరికపూడి గాంధీకి నజరానాలు ఇస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైడ్రా మంత్రులకు కాపలా కాస్తోందని విమర్శించారు. హైడ్రా వెనక సీఎం రేవంత్ ఉన్నారని తెలిపారు. పేద ప్రజలను ప్రభుత్వం భయపెడుతుందని మండిపడ్డారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.