భవ్య హెల్త్ కేర్ అన్యాయాలపై 104 ఉద్యోగుల నిరసన

భవ్య హెల్త్ కేర్ అన్యాయాలపై 104 ఉద్యోగుల నిరసన

కృష్ణా: భవ్య హెల్త్ కేర్ సర్వీస్ సంస్థ 104 ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా మచిలీపట్నంలో 104 అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. తగ్గించిన వేతనాలు రద్దు చేసిన క్యాజువల్ లీవులు పునరుద్ధరించాలని ధర్నా నిర్వహించారు. ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల సర్వీస్ దాటిన డ్రైవర్లకు స్లాబ్ మార్పు, జీవో ప్రకారం రూ.18,500 వేతనం ఇవ్వాలని కోరారు.