క్రీడలు క్రమశిక్షణను పెంచుతాయి: ఎమ్మెల్యే

క్రీడలు క్రమశిక్షణను పెంచుతాయి: ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో నిర్వహించిన 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్- 2025-26ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇవాళ ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.