ఇసుక ట్రాక్టర్‌లు పట్టివేత

JN: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పాలకుర్తి ఎస్సై దూలం పవన్ హెచ్చరించారు. పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పాలకుర్తి ఎస్సై పవన్ శుక్రవారం పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.