ఎలివేటెడ్ షెడ్ల వల్ల అంటురోగాలు నివారించవచ్చు

ఎలివేటెడ్ షెడ్ల వల్ల అంటురోగాలు నివారించవచ్చు

BDK: ఎలివేటెడ్ షెడ్ల వల్ల జీవాల్లో అంటురోగాలు నివారించవచ్చు అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మద్దూకూరు గ్రామంలో రైతు తలారి రవి ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ మేకలు, గోర్రెల పెంపక షెడ్‌ను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల పశుసంవర్ధక అధికారి డాక్టర్ సంతోష్ తదితరులు ఉన్నారు.