ఆ చరిత్ర KCRదే: హరీష్ రావు
TG: 'రానే రాదు.. కానే కాదు' అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత KCRదే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోజు కేసీఆర్ చేసిన దీక్ష ఉద్యమగతిని మలుపు తిప్పిందన్నారు. పదవులే కాదు.. తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం ఆయనదన్నారు. నాలుగు కోట్ల ప్రజల్లో మార్మోగే 'జై తెలంగాణ' అనే రణనాదమే ఆయన పేరని పేర్కొన్నారు.