VIDEO: కంఠమహేశ్వర స్వామికి ప్రత్యేక బోనం..!
WGL:వర్ధన్నపేట పట్టణంలోని తూర్పువాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా ఇవాళ గౌడ కులస్తులు శ్రీ కంఠమహేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గౌడ కుల పెద్దమనిషి వడ్లకొండ శ్రీనివాస్, సమ్మెట శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కులస్తులంతా ఐక్యంగా పండుగను ఘనంగా జరుపుకున్నారు.