PUలో 30కి పైగా కోర్సులు.. 157 కళాశాలలు
MBNR: పాలమూరు వర్సిటీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం YSR ప్రారంభించగా.. 6 కోర్సుల్లో 180 మందితో మొదలైంది. ప్రస్తుతం దాదాపుగా 31 పైగా కోర్సులు, పాలమూరు వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల్లో 16 వేలకు పైగా మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 157 కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా వర్సిటీలో ఇంజినీరింగ్, లా కోర్సులు ప్రారంభమయ్యాయి.