ఇందిరమ్మ ఇళ్ల కాలనీని ప్రారంభించనున్న సీఎం

ఇందిరమ్మ ఇళ్ల కాలనీని ప్రారంభించనున్న సీఎం

SRPT: హుజూర్‌నగర్‌లో రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని కలెక్టర్ తేజస్ తెలిపారు. మంగళవారం కాలనీ పనులను పరిశీలించిన ఆయన, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికే ఇళ్లు అందేలా జాబితాను పకడ్బందీగా రూపొందించాలనీ అన్నారు.