'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

ప్రకాశం: పెద్దారవీడు ఎస్సై వీ. సాంబశివయ్య శనివారం మండలంలోని భూ రెడ్డి పల్లి జంక్షన్ వద్ద వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్డుమీద ప్రయాణించే సందర్భాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, దాని వలన జరిగే నష్టాలను వాహనదారులకు వివరిస్తూ.. ప్రతి ఒక్క మోటార్ బైక్ నడిపే వ్యక్తులు, వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు.