సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్
BDK: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నూతన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ IAS అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేసి సింగరేణి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇంఛార్జ్ సీఎండీగా ఉన్న డి.కృష్ణా భాస్కర్‌ను ప్రభుత్వం నియమించింది.