'పొట్టి శ్రీరాములు త్యాగాలు చిరస్మరణీయం'
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలోని APSP 11వ పోలీసు బెటాలియన్‌లో సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ పి.రాజశేఖర్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.