మూడవ బహుమతి అందుకున్న హెడ్ కానిస్టేబుల్
కడప జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ నెలలో నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో బ్రహ్మంగారిమఠం హెడ్ కానిస్టేబుల్ చిన్న సుబ్బయ్య మూడో బహుమతి సాధించాడు. ఎస్పీ నచికేత్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, మండల ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.