జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై అవగాహన
MDK: తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు వితంతువులకు ఎన్ఎఫ్‌బీఎఫ్ పథకం కింద రూ. 20 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి దరఖాస్తులు చేసే విధంగా చూడాలని సూచించారు.