కనువిందు చేస్తున్న జలపాతం

కనువిందు చేస్తున్న జలపాతం

ASR: ముంచింగిపుట్టు మండలంలో బురద గుంట జలపాతం కనువిందు చేస్తోంది. రాతి పర్వతం పైనుంచి తెల్లటి నురగలతో, గల గలా శబ్ధం చేస్తూ ప్రవహిస్తున్న ఈ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. మండల కేంద్రానికి 6కిమీ దూరంలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. అర కిలోమీటర్ మేర కాలినడకన వెళ్లవలసి ఉంటుందని పర్యాటకులు తెలిపారు. సరైన రహదారి సౌకర్యం లేదని, ప్రభుత్వం రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.