బాలుర వసతి గృహాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్టీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను నగర రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనాన్ని పరిశీలించారు. అక్కడ చట్నీలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో హాస్టల్ వార్డెన్‌కు మెమో జారీ చేయాలని షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారిణిని ఆదేశించారు.