ముస్లిం సంక్షేమ కమిటీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ముస్లిం సంక్షేమ కమిటీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి ముస్లిం సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్ బుధవారం ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగిందని కమిటీ అధ్యక్షుడు షేక్ గయాజుద్దీన్ తెలిపారు. ఈ కార్య క్రమంలో ముకరం అలీ, అహ్మద్ పాషా, అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.