నూతన సర్పంచ్‌కు మంత్రి అభినందన
WNP: ఆత్మకూరు మండలం కత్తేపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా గెలుపొందిన దోమ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మంగళవారం అభినందించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నిలబడి , శ్రీనివాస్ రెడ్డి 402 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.