VIDEO: శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం
ASF: బెజ్జార్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి శిథిలావస్థకు చేరింది. ఆసుపత్రి గోడలపై మొక్కలు మొలకెత్తాయి. దీంతో గోడలు బీటలు బవారాయని స్థానికులు తెలిపారు. వీటిపై మొలిచిన రావి చెట్లను తొలగించకపోతే ఆసుపత్రి కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వాటిని తొలగించాలని ఆసుపత్రికి వచ్చే ప్రజలు కోరుతున్నారు.