'చిన్నపిల్లల ఆరోగ్యం, పోషణపై శ్రద్ధ చూపాలి'
కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో నిర్వహిస్తున్న పోషణ పక్వాడ కార్యక్రమంలో ఎంపీడీవో ఇమ్రాన్ పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు చిన్నపిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్‌లు సమన్వయంతో పని చేసి ప్రతి లబ్ధిదారునికి సేవలు అందించాలని తెలిపారు.