చెరువులను తలపిస్తున్న పంట పొలాలు

VKB: జిల్లాలో నవల్గా, కొర్విచెడ్, గొట్టిగ గ్రామాల్లోని పత్తి, కంది పంటలు భారీ వర్షాలకు నీట మునిగాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.