'వినాయక చవితి పండుగ అనుమతి తీసుకోండి'

TPT: వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పోలీసులతో ఆటోలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. Ganeshutsav.net వెబ్సైట్లో అప్లై చేసుకుని పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలని కోరారు. అనుమతి తీసుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.