బస్‌స్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
ఖమ్మం ఆర్టీసీ బస్ స్టాండ్‌ను ఆర్ఎం సరీరామ్ సోమవారం తనిఖీ చేశారు. ఇటీవల పాత బస్టాండ్‌లో జరుగుతున్న దొంగతనాల ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన స్పందించారు. రెండు బస్టాండ్‌లలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్ స్టాండ్‌లో పరిశుభ్రత, భద్రతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆయన సూచించారు.