CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA

KDP: కడప నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు కడప టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డిలు 79 మంది లబ్ధిదారులకు 79,53,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.