పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి:కలెక్టర్
CTR: చిత్తూరు నగర పరిధిలోని ప్రశాంత్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ప్రశాంత్ నగర్‌లో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. భవనంలో ఫ్లోరింగ్, ర్యాంప్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కాంపౌండ్ వాల్ పనులు చేపట్టాలని ఆదేశించారు.