ప్రజల సమస్యలు నిర్ధిష్ట గడువులోపు పరిష్కరించాలి: యార్లగడ్డ

ప్రజల సమస్యలు నిర్ధిష్ట గడువులోపు పరిష్కరించాలి: యార్లగడ్డ

కృష్ణా: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నామని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. బాపులపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో సమావేశం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అందిన అర్జీలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, ఎస్సీ కాలనీ, ఇందిరా నగర్లో సీసీ రోడ్లను ప్రారంభించారు.