నష్టపోయిన పంటలను పరిశీలించిన కలెక్టర్

నష్టపోయిన పంటలను పరిశీలించిన కలెక్టర్

ADB: తలమడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పర్యటించారు. కొత్తూర్, డోర్లి, తలమడుగు గ్రామాలకు చెందిన రైతుల పత్తి పంట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతినడంతో ఆయన పరిశీలించారు. త్వరలో నష్టపోయిన పంటల వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.