VIDEO: గెలిచిన వెంటనే సమస్యలను నెరవేరుస్తా: కాంగ్రెస్ అభ్యర్థి
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో గడపగడపకు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నండ్రె సునీత-రవీందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నండ్రె సునీత మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన సమస్యలను గెలిచిన వెంటనే నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రవి,గ్రామ అధ్యక్షుడు శ్రీరామ్ రాజు, మధుకర్ కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.