డివైడర్‌ను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

డివైడర్‌ను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రకాశం: పామూరు మండలం భూమిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌కు ఢీకొని వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. భూమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రిపయల్ అనే వ్యక్తి మేకల కాపరులకు మోటార్ సైకిల్‌పై భోజనం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక వివరాలు తెలియవలసి ఉంది.