శ్రీ సూర్యనారాయణ స్వామివారి గ్రామోత్సవం

తూర్పుగోదావరి: కామరాజుపేట దుర్గా కాలనీలో సనాతన ధర్మ ప్రబోధనా స్వచ్ఛంద సమితి ఆధ్వర్యంలో సోమవారం ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ స్వామివారి ని గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో తోట సాయిబాబా, అక్షింతల రాజా, దోసపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.