'గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయాలి'

'గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయాలి'

ఆదిలాబాద్‌లోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించనున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య పిలుపునిచ్చారు. వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న ప్రారంభోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న కవి సమ్మేళనం, 17న వ్యాసరచన, 18న ఉపన్యాస పోటీలు, 19న ముగ్గుల పోటీలు, 20న ముగింపు సమావేశం ఉంటుందని వివరించారు.