39 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ.13.78 కోట్లు

39 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ.13.78 కోట్లు

NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో 39 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో 35 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 3 బ్లాక్ హెల్త్ యూనిట్లు, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. ఈ నిధుల మంజూరుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.