జొన్న ఇగురు తిని 35 గొర్రెలు మృతి

జొన్న ఇగురు తిని 35 గొర్రెలు మృతి

ATP:పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి సమీపంలో చిత్రచేడుకు చెందిన పలువురు రైతులకు చెందిన గొర్రెల మంద పొలంలో జొన్న ఇగురు తిన్నాయి. అనంతరం కాలువ నీరు తాగడంతో 35 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పశువైద్యాధికారి రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గొర్రెల యజమానులు రామాంజనేయులు, పుల్లన్న, గణేష్, నాగార్జున కన్నీరుమున్నీరవుతున్నారు.