తుఫాన్ పరిస్థితులను పరిశీలించిన మంత్రి
SS: మొంథా తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన వాతావరణ పరిస్థితులను మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ నగరంలో పరిశీలించారు. బస్టాండ్, రాజీవ్‌పార్క్ పరిసర ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించి తుఫాన్‌కు సంబంధించిన సన్నద్ధతను సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయ కేంద్రాలను సంప్రదించాలని మంత్రి సూచించారు.